SS: జిల్లాను ప్రమాద రహితంగా మార్చేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. మంగళవారం ఎస్పీ సతీష్ కుమార్తో కలిసి నిర్వహించిన రహదారి భద్రతా సమావేశంలో ఆయన మాట్లాడారు. రహదారులపై బ్లాక్ స్పాట్స్ గుర్తించి సూచిక బోర్డులు, బ్లింకర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ఏడాది 518 ప్రమాదాల్లో 314 మంది మృతి చెందారని ఎస్పీ వివరించారు.