KRNL: జిల్లా సర్వజన వైద్యశాలలో ఓ మహిళకు వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. ఈ వివరాలను యూరాలజీ హెచ్ఐవోడీ, డిప్యూటీ సూపరింటెండెంటు డా.సీతారామయ్య శుక్రవారం వెల్లడించారు. కడపకు చెందిన రమణమ్మ (49) గత 6 నెలలుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ కడప సర్వజన వైద్యశాలలో సీటీ స్కానింగ్ చేయించుకున్నారు.