ATP: ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి సత్యకుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగను ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరగడం బాధాకరమని అన్నారు. ఘటన గురించి జిల్లా అధికారులతో మాట్లాడి, బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని డాక్టర్లకు సూచించినట్లు తెలిపారు. బాధితులకు అండగా ఉంటామని పేర్కొన్నారు.