కోనసీమ: అమలాపురంలో సోమవారం ఉదయం 10 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. అర్జీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. తమ అర్జీలు పరిష్కారం కాకపోయినా లేదా సమాచారం తెలుసుకోవడానికి 1100 నెంబర్కు కాల్ చేయవచ్చని ఆయన సూచించారు.