NDL: బనగానపల్లె పట్టణంలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను శనివారం నాడు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. పట్టణంలోని అవుకు మెట్ట వద్ద సొంత నిధులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. బనగానపల్లె పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడానికే మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు.