BHNG: తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని తెలంగాణ అడిషనల్ డీజీపీ శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో శనివారం దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ భాస్కరరావు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేసి స్వామివారి వేద ఆశీర్వచనం అందజేసి స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.