ATP: అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్మన్గా నేడు బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా బల్లా పల్లవి తన ఇష్ట దైవం శిరిడి సాయిబాబాను దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులతో ఈ పదవిని స్వీకరించడం సంతోషంగా ఉందన్నారు. రైతుల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తానని వెల్లడించారు.