E.G: రాజమండ్రి గామన్ బ్రిడ్జిపై జీరో శాతం ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ట్రాఫిక్ డీఎస్పీ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. రాజమండ్రిలో ఎన్ హెచ్ అధికారులు, గామన్ బ్రిడ్జ్ మెయింటెనెన్స్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ డీఎస్పీ మాట్లాడుతూ.. బ్రిడ్జి రోడ్డుపై ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలని, గోతులు లేకుండా చూడాలని సూచించారు.