వైజాగ్(Vizag)లో మత్తు ఇంజక్షన్లు ముఠాను పోలీసులు (police) అరెస్ట్ చేశారు. గుట్టుచప్పుడు కాకుండా మత్తు ఇంజక్షన్లను అమ్ముతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఏడు వేల మత్తు ఇంజెక్షన్లు (Anesthetic injections) స్వాధీనం చేసుకున్నారు. యువతను టార్గెట్ చేస్తు కొంతమంది ముఠాగా ఏర్పడి ఇంజెక్షన్లు అమ్ముతున్నారనే పక్కా సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. విశాఖ నుంచి పశ్చిమ బెంగాల్ (West Bengal) కు తరలిస్తుండగా పట్టకున్నారు. ఎనిమిదిమందిని అరెస్ట్ చేశారు. అలా రెండు రోజుల్లో మూడు కేసుల్లో ఏడు వేల మత్తు ఇంజెక్షన్లను ముఠా నుంచి స్వాధీనం చేసుకుని వాటిని సీజ్ చేశారు.
పెందుర్తి (Pendurthi) పరిధిలో 100 ఇంజక్షన్లను సెబ్ అధికారులు గుర్తించారు. ఐదు రోజుల క్రితం అల్లిపురం(Allipuram)లో 2,500 మత్తు ఇంజక్షన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.యువతను టార్గెట్ చేసుకుని సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల డ్రగ్స్ వినియోగం పెరిగిపోవడంతో పోలీసులు నిఘా పెట్టగా కేటుగాళ్లు అడ్డంగా బుక్ అయ్యారు.గంజాయి, మత్తు ఇంజక్షన్లకు అల్లిపురం కేంద్రంగా మారుతోంది. యువతను టార్గెట్ చేస్తూ లక్షల్లో వ్యాపారం నిర్వహిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖ పోలీస్ కమిషనర్ సీపీ త్రివిక్రమ వర్మ (CP Trivikrama Verma)హెచ్చరించారు.