కోనసీమ: మామిడికుదురు మండలం పెదపట్నంలంక గ్రామంలో ఇంటి అల్లుడు కోట ఉదయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా అత్తింటి వారు 105 రకాల పిండి వంటలతో గ్రాండ్గా విందు ఏర్పాటు చేశారు. కుంపట్ల శ్రీనివాసు, పద్మావతి దంపతులు ఈ పసందైన విందును అల్లుడి కోసం ఏర్పాటు చేశారు. అరిటాకులో వాటిని వడ్డించి సంప్రదాయానికి ప్రాధాన్యం ఇచ్చారు.