W.G: రైతులు భూములకు ఖచ్చితమైన హద్దులు గుర్తించి రికార్డులు ఆధునీకరించేందుకు ప్రయోగాత్మకంగా రీ సర్వే నిర్వహించటం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం మొగల్తూరు మండలం కె.పి పాలెం గ్రామంలో జరుగుచున్న రీ సర్వే గ్రౌండ్ ట్రూతినింగ్ పనులను జేసీ సరిహద్దుల మ్యాప్‌లను పరిశీలించారు.