కోనసీమ: అమలాపురం నుంచి రాజమండ్రికి వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, AMP – RJY నాన్ అల్ట్రా డీలక్స్ బస్సు సర్వీసులను అక్టోబర్ 27, సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి రాఘవ కుమార్ తెలిపారు. ఈ బస్సులు వయా నడిపూడి, ముక్కామల మీదుగా ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ప్రతి 2 గంటలకు అందుబాటులో ఉంటాయన్నారు.