సత్యసాయి: సత్యసాయి బాబా 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రముఖ సరోద్ విద్వాంసులు ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్, ఆయన కుమారుడు అయాన్ అలీ బంగాష్ ఇవాళ ‘స్ట్రింగ్స్ ఫర్ పీస్’ పేరిట కచేరీని నిర్వహించారు. పుట్టపర్తిలో జరిగిన ఈ సంగీత కార్యక్రమం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ తమ అద్భుత సరోద్ వాదనతో సాయి బాబాకు సంగీత నివాళులర్పించారు.