AKP: నర్సీపట్నం అడ్డురోడ్డు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఇవాళ జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు చేసినట్లు ఆర్డీవో రమణ తెలిపారు. నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. డివిజన్ పరిధిలోని తహశీల్దార్ కార్యాలయాల్లో రెవెన్యూ క్లినిక్లు కూడా రద్దయ్యాయని ప్రజలకు సూచించారు.