NDL: పాణ్యం మం. గోనవరం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలను టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు, పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో సంభాషించి వారి అభ్యసనా సామర్థ్యాలను పరిశీలించారు. విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.