TPT: దక్కిలి మండలం దగ్గవోలు గ్రామ దేవత తాళమ్మ అమ్మవారి కొలుపు మహోత్సవ వేడుకలు ఈ నెల 25 నుండి మూడు రోజులపాటు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా, గత మూడు సంవత్సరాలుగా ఈ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు 25న ప్రారంభమై 26, 27 తేదీల్లో ఈ వేడుకలు ముగుస్తాయన్నారు. ఇందుకోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.