ATP: గుంతకల్లు పురపాలక సంఘంలో శనివారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ప్రశాంతంగా ముగిసింది. ఈ సమావేశం మున్సిపల్ ఛైర్మెన్ భవాని అధ్యక్షత వహించారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులు జరగబోయే అభివృద్ధి పనుల గురించి ఎజెండాలు రూపొందించిన అంశాలను మున్సిపాలిటీ అధికారులు చదివి వినిపించారు. రానున్న వేసవిలో నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.