కోనసీమ: ఆత్రేయపురంలో ఉన్న శ్రీలక్ష్మీ డ్రై ఫ్రూట్ షాపులో గ్రామస్తుల చేత పట్టుబడిన నెయ్యి కల్తీదని తేలింది. మే 22న కాలువ రేవులో కల్తీనెయ్యి దిగుబడి అయినట్లు గ్రామస్తులు సమాచారం అందడంతో జిల్లా అధికారి శ్రీకాంత్ గ్రామానికి చేరుకుని నెయ్యిని పరిశీలించారు. నమూనాలు సేకరించి హైదరాబాద్లోని ప్రయోగశాలకు పంపగా మంగళవారం కల్తీ అని తేలింది.