VSP: విశాఖలోని వాల్తేరు అర్ల్యాండ్స్లో పేకాట ఆడుతున్న ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలను టాస్క్ ఫోర్స్ సీఐ భాస్కర్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. వారి నుంచి రూ.27,500 నగదును పోలీసులు సీజ్ చేశారు. నిందితులను 3 టౌన్ పోలీసులకు అప్పగించగా సీఐ పైడయ్య కేసు నమోదు చేశారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు దాడులు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.