AKP: లంకవానిపాలెం పీహెచ్సీ పరిధిలోని 10 సచివాలయాలు,10 ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వరకు మహిళల ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నట్లు వైద్యాధికారిణి డా.శైలజా సురేష్కుమార్ తెలిపారు. గుండె జబ్బులు, గర్భాశయ కాన్సర్ పరీక్షలు, రక్తహీనత చికిత్స, టీబీ స్కీనింగ్, కిషోర్ బాలికల పరీక్షలు, తల్లి బిడ్డ సేవలు, పోషకాహార సలహాలు అందించనున్నారని తెలిపారు.