E.G: రాజమండ్రిలోని బిలాల్ మసీదును పునర్మించేందుకు మసీదు కమిటీ నిర్ణయించింది. ప్లాన్ అప్రూవల్ పూర్తి చేసేందుకు పొజిషన్ సర్టిఫికెట్ కాల్సివచ్చింది. విషయాన్ని మసీదు కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా అధికారులతో మాట్లాడి పొజిషన్ సర్టిఫికెట్ వచ్చేలా చేశారు. దీంతో ముస్లిం మైనారిటీ నాయకులు శనివారం MLAకు కృతజ్ఞతలు తెలిపారు.