ప్రకాశం: బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పామూరు సిఐ భీమా నాయక్ అన్నారు. గురువారం పామూరు పట్టణంలో పలు ప్రదేశాలలో సీఐ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు పట్టణ శివారు ప్రాంతంలో బహిరంగంగా ముగ్గురు వ్యక్తులు మద్యం సేవిస్తుండగా వారిని ఏఎస్సై షేక్ జిలాని భాషా కౌన్సిలింగ్ ఇచ్చారు.