KKD: పంచారామ క్షేత్రమైన సామర్లకోట శ్రీ కుమార రామ భీమేశ్వర హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. 199 రోజులకు గాను హుండీల ద్వారా రూ. 19,96,390 ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వాహణాధికారి బళ్ళ నీలకంఠం చెప్పారు. దేవాదాయ శాఖ తనిఖీ అధికారి ఫణి కుమార్ ఆధ్వర్యంలో ఆదాయం లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు.