కృష్ణా: ఉయ్యూరులో ఉన్న ఎం.కే. స్కూల్లో బాలికల భద్రతపై నిన్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. విద్యార్థులకు శక్తి యాప్ యొక్క ప్రాముఖ్యత, దాని ద్వారా ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో సహాయం పొందవచ్చో వివరించారు. అపరిచిత వ్యక్తులతో మాట్లాడకూడదని, ఎవరైనా అనుచిత ప్రవర్తనకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.