ATP: రాప్తాడు మండలం గంగులకుంట గ్రామంలో ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను ఎమ్మెల్యే పరిటాల సునీత పంపిణీ చేశారు. ప్రభుత్వ రాజముద్రతో కూడిన ఈ పుస్తకాలను అధికారులతో కలిసి రైతులకు అందజేశారు. భూహక్కు పత్రాలతో రైతులకు భరోసా కలుగుతుందని, పారదర్శకమైన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.