ATP: గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను సోమవారం ఆయన నివాసంలో ప్యాపిలి మండలం గుడిపాడు గ్రామానికి చెందిన వాల్మీకి కుల పెద్దలు మర్యాదపూర్వకంగా కలిశారు. గుడిపాడులో వాల్మీకి విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పెద్దలు ఎమ్మెల్యేకు తెలిపారు. దీంతో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, వాల్మీకి విగ్రహాన్ని తన సొంత నిధులతోనే ఇప్పిస్తానని వారికి హామీ ఇచ్చారు.