W.G: జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరుగుతుందని, ఇప్పటివరకు 2.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 37 వేల మంది రైతులు నుంచి కొనుగోలు చేసినట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. ధాన్యాన్ని కొనుగోలు చేసిన 24 గంటల్లోపుగా రూ. 483.27 కోట్లు, 48 గంటల లోపుగా రూ. 18.84 కోట్ల నగదు రైతుల ఖాతాల్లో జమయ్యాయని తెలిపారు.