సత్యసాయి: హిందూపురం–పెనుకొండ ప్రధాన రహదారిలోని కొట్నూరు గ్రామ సమీపంలో గురువారం సాయంత్రం లారీ చెరువులో పడిన ఘటన జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. హిందూపురం వైపు నుంచి పెనుకొండకు వస్తున్న లారీ ఒక్కసారిగా అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న చెరువులోకి దూసుకెళ్లిందని తెలిపారు. ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడినట్లు సమాచారం.