KDP: యోగివేమన విశ్వవిద్యాలయ పరిధిలో తుఫాన్ కారణంగా వాయిదా పడిన పరీక్షను మంగళవారం నిర్వహిస్తున్నట్లు యోగి వేమన విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కృష్ణారావు సోమవారం తెలిపారు. ఈ విషయాన్ని పీజీ విద్యార్థులు గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దిత్వా తుఫాన్ కారణంగా పరీక్ష వాయిదా వేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు.