ప్రకాశం: ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఐదు దశాబ్దాల పాటు పోరాడి అరుణ బావుటా నీడలో సాగిన ఏచూరి జీవితం అజరామరమైనదని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు అన్నారు. ఇవాళ కొండేపి మండలంలోని పెరిదేపిలో CPIM జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రధమ వర్ధంతి నిర్వహించారు. ఆంజనేయులు మాట్లాడుతూ.. ప్రజల కోసం తన జీవిత సర్వస్వాన్ని త్యాగం చేసిన యోధులకు మరణం లేదని అన్నారు.