సీఎం జగన్ (CM Jagan) ను క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మేనేజ్మెంట్,తో అంబటి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎస్కే టీంను సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ఆంధ్రప్రదేశ్’(Andhra Pradesh) లోక్రీడారంగం అభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా క్రీడలను ప్రోత్సహించడానికి తాను ఆసక్తిగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి అంబటి రాయుడు వివరించారు. క్రీడారంగంపట్ల పటిష్టమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. ఇటీవల ఐపీఎల్ (IPL) ట్రోఫీ గెలుచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ట్రోఫీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సీఎస్కే ఫ్రాంచైజీ ఓనర్ ఎన్.శ్రీనివాసన్ కుమార్తె రూపా గురునాథ్(Rupa Gurunath),అంబటి రాయుడు చూపించారు. ఈ సందర్భంగా సీఎస్కే టీం సభ్యుల ఆటోగ్రాఫ్‌తో కూడిన జెర్సీని ముఖ్యమంత్రికి రూపా గురునాథ్, అంబటి రాయుడులు బహుకరించారు. గుంటూరు (Guntur) జిల్లాకు చెందిన అంబటి రాయుడు కొంత కాలంగా రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన రాయుడు జనసేన(Janasena)లో చేరతారనే ప్రచారం జరిగింది. అయితే, కొద్ది రోజుల కిందట ఆయన సీఎం జగన్ ప్రసంగాన్ని రీట్వీట్ చేశారు. దీంతో వైఎస్సార్సీపీ(YSRCP)లో చేరబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.