Narayana: ప్రధాని మోడీ (modi) తీరును సీపీఐ నారాయణ తప్పుపట్టారు. మరోసారి అధికారంలోకి వస్తే దేశం రెండుగా విడిపోయే ప్రమాదం ఉందన్నారు. ఉత్తర భారత, దక్షిణ భారతం అని విడిపోతాయని చెప్పారు. అలాగే బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం కూటమి నిజమైన కూటమి అని ఆరోపించారు.
చంద్రబాబును అరెస్ట్ చేస్తే బీజేపీకి మేలు కలుగుతుందని మోడీ అనుకున్నారని వివరించారు. అందుకే అరెస్ట్ చేయించారని.. అదే సీఎం జగన్కు వర్తిస్తోందని తెలిపారు. విషయం తెలియక.. జగన్ ఆనంద పడుతున్నారని ఆరోపించారు. కక్షపూరితంగా వ్యవహరించి కేసులు నమోదు చేయడం సరికాదన్నారు.
ప్రభుత్వ ఖర్చులతో రాష్ట్రాల పర్యటనలు చేస్తూ.. రాజకీయాలు మాట్లాడటం మోడీకి తగదన్నారు. కేసీఆర్ ఎన్డీఏ కూటమిలో చేరతారనే కామెంట్లను తప్పుపట్టారు. దీనిపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.