సూపర్ కృష్ణ నిన్న తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా… నేడు ఆయన భౌతిక కాయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాళులర్పించారు. అనంతరం ఘట్టమనేని కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.
హైదరాబాద్ పద్మాలయా స్టూడియోస్ లో కృష్ణ భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. శ్వాస కోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న కృష్ణ ఆదివారం సాయంత్రం గుండెపోటుకి గురయ్యారు. హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ఆయన్ని కుటుంబ సభ్యులు చేర్చారు.సోమవారం సాయంత్రం ఆయన పరిస్థితి విషమించగా.. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో కృష్ణ మరణించారు. ఆయన మరణంతో అభిమానులు, తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.
బుధవారం అధికార లాంఛనాలతో కృష్ణకు అంత్యక్రియలు జరుగుతాయి. ఉదయం గంటల నుంచి 12 గంటల వరకు పద్మాలయా స్టూడియోలో ఆయన భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు మహా ప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తారు.