ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన సీఎం జగన్…. నేడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన… మాజీ సీఎం జగన్, పవన్ లపై విమర్శల వర్షం కురిపించారు. కుందుకూరు ఘటనపై కూడా ఆయన స్పందించారు.
కొందరు ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రం.. ఈ ప్రజలు కాకపోతే ఆ ప్రజలు..ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ.. ఈ భార్య కాకపోతే ఆ భార్యతో అన్నట్లు వీరి స్టైల్ అన్నారు జగన్. ఒక్క ఎమ్మెల్యే లేడు.. రెండు చోట్ల పోటీచేస్తే రెండు చోట్లా ప్రజలు ఓడించారని ఎద్దేవా చేశారు. ఈయనకు నిర్మాత, దర్శకుడు చంద్రబాబే అన్నారు. కాల్ షీట్లు ఇచ్చి షూటింగ్‌కు వస్తారంటూ సెటైర్లు పేల్చారు. చంద్రబాబు స్క్రిప్ట్ ఇస్తారు.. బాబు చెప్పిన డైలాగ్స్‌కు ఈయన యాక్ట్ చేస్తారన్నారు. దత్త తండ్రిని నెత్తిన పెట్టుకని దత్తపుత్రుడు ఊరేగుతున్నాడన్నారు.
రాష్ట్రంలో ఏ మంచి జరిగినా తానే చేశానని.. తన వల్లే జరిగిందని చంద్రబాబు చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు. చివరికి సింధు బ్యాడ్మింటన్‌లో గెలిచినా.. తానే నేర్పించాడంటారని సెటైర్లు పేల్చారు. కందుకూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపైనా జగన్ స్పందించారు. ఫోటో షూట్ కోసమే కందుకూరు సభ అన్నారు. జనం రాకపోయినా బాగా వచ్చారని చూపేందుకు ఇరుకు సందుల్లో సభ పెట్టారన్నారు. ఎనిమిదిమందిని చంపేశారు ఇంతకన్నా ఘోరం ఉంటుందా అన్నారు.
గోదావరి పుష్కరాల్లోనూ షూటింగ్ కోసం 29మంది ప్రాణాలు తీశారన్నారు. రాజకీయం అంటే షూటింగ్‌లు కాదు.. డైలాగులు కాదన్నారు. రాజకీయం అంటే డ్రోన్ షాట్లు కాదన్నారు. రాజకీయం అంటే డ్రామాలు అంతకన్నా కాదన్నారు. రాజకీయం అంటే పేద కుటుంబాల్లో మంచి మార్పు తీసుకురావడం అన్నారు.