CJI: స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్(Skill Development Project) కేసులో టీడీడీ అధినేత నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. రాజమండ్రి జైలులో జ్యుడిసీయల్ కస్టడీలో ఉన్నారు. రిమాండ్‌ను రద్దు చేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ మంగళవారం విచారణకు జరపేందుకు అవకాశం ఉంది.
చంద్రబాబు పిటిషన్‌కు సుప్రీంకోర్టు కేసు నంబర్ కేటాయించారు. విచారణ తేదీ ఇంకా నిర్ణయించలేదు. చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సీజేఐ ధర్మాసనం ముందు ప్రస్తావించారు. చంద్రబాబు జైలుకెళ్లిన నేపథ్యంలో తక్షణమే విచారణ జరిపించాలని కోరారు. చంద్రబాబు పిటిషన్ ఆరోజు ప్రస్తావన జాబితాలో లేకపోవడంతో, వెంటనే దర్యాప్తు ప్రారంభించేందుకు సీజేఐ నిరాకరించారు. దీనిని మంగళవారం పరిశీలించేందుకు సీజేఐ అంగీకరించారు, ఒకవేళ అది జాబితాలో లేకపోతే పూర్తి విచారణ చేస్తారు. చంద్రబాబు నాయుడు కస్టడీ కాలవ్యవధిపై సీజేఐ ఆరా తీయగా, ఈ నెల 8వ తేదీన అరెస్టు చేసినట్లు లూథ్రా స్పష్టం చేశారు. మంగళవారం ప్రస్తావనకు అనుమతిస్తే, తక్షణ ఉత్తర్వులు జారీ చేయవచ్చని లేదా పూర్తి విచారణకు తేదీని నిర్ణయించవచ్చని తెలుస్తుంది. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీలో ఉంటూ.. కేసు గురించి సీనియర్ లాయర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు.