హిందూపురం ఎంపీ గోరంట్ల (MP Gorantla) మాధవ్ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన ఎన్ని యాత్రలు చేసిన సీఎం జగన్ (CM Jagan) జైత్రయాత్రను ఆపలేరని మాధవ్ అన్నారు. 2024లో జగన్ మళ్లీ సీఎం అవుతారని చంద్రబాబు చస్తాడు అని నిన్నటి సామాజిక సాధికార యాత్రలో వివాదాస్పదంగా మాట్లడారు. చంద్రబాబు (Chandrababu) బస్సు యాత్ర చేసి ఇప్పుడు జైలు యాత్ర చేస్తున్నారని ఆయన అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వారాహి యాత్ర చేసి.. ఇప్పుడు పారిపోయే యాత్ర చేస్తున్నారని గోరంట్ల ఎద్దేవా చేశారు. నారా లోకేశ్ యువగళం యాత్ర చేసి.. ఇప్పుడు ఢిల్లీ (Delhi) చుట్టూ తిరిగే యాత్ర చేస్తున్నారని అన్నారు. లోకేశ్ పాదయాత్రను పక్కన పెట్టి పారిపోయారని చెప్పారు. మరోవైపు చంద్రబాబును ఉద్దేశించి గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు టీడీపీ (TDP) శ్రేణుల్లో కలకలం రేపుతున్నాయి. జైల్లో చంద్రబాబుకు ఏదైనా అపకారం తలపెట్టే అవకాశం ఉందని ఇప్పటికే టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిపిందే.