chandrababu on cm jagan: నమ్మకం కాదు దరిద్రం.. సైకో సీఎం అంటూ జగన్పై బాబు ఫైర్
chandrababu on cm jagan:ఏపీ సీఎం జగన్పై (jagan) ప్రతిపక్ష నేత చంద్రబాబు (chandrababu) ఫైరయ్యారు. జగన్ ప్రజల ఇళ్లపై నువ్వే మా నమ్మకం అని కొత్తగా స్టిక్కర్లు వేస్తాడట.. 'నువ్వే మా నమ్మకం కాదు.. నువ్వే మా దరిద్రం' అని ప్రజలు అంటున్నారని చంద్రబాబు (chandrababu) ధ్వజమెత్తారు. ప్రజల కష్టాలకు కారణమైన వారే మీ నమ్మకం అంటూ స్టిక్కర్ (sticker) వేస్తాడట అని ఎద్దేవా చేశారు.
chandrababu on cm jagan:ఏపీ సీఎం జగన్పై (jagan) ప్రతిపక్ష నేత చంద్రబాబు (chandrababu) ఫైరయ్యారు. జగన్ ప్రజల ఇళ్లపై నువ్వే మా నమ్మకం అని కొత్తగా స్టిక్కర్లు వేస్తాడట.. ‘నువ్వే మా నమ్మకం కాదు.. నువ్వే మా దరిద్రం’ అని ప్రజలు అంటున్నారని చంద్రబాబు (chandrababu) ధ్వజమెత్తారు. ప్రజల కష్టాలకు కారణమైన వారే మీ నమ్మకం అంటూ స్టిక్కర్ (sticker) వేస్తాడట అని ఎద్దేవా చేశారు. సైకో జగన్ను ఇంటికి పంపేందుకు వీర నారీమణుల్లా మహిళలు (woman) పోరాడాలని పిలుపునిచ్చారు. కాకినాడ (kakinada) జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ‘ఇదేం ఖర్మ’ మన రాష్ట్రానికి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన రోడ్ షోలో పాల్గొని మాట్లాడారు.
ప్రజలపై 45 రకాల పన్నులు (45 taxes) వేసిన సైకో సీఎం జగన్ అని మండిపడ్డారు. తన బిడ్డకు ఉద్యోగం వచ్చిందని ఏ తల్లైనా చెప్పగలదా అని ప్రశ్నించారు. జగన్రెడ్డి ఇచ్చే పది రూపాయలు మాత్రమే కనిపిస్తోందని, దోచుకునే రూ.50 గురించి తెలుసుకుంటే వైసీపీ నేతలను (ycp leaders) ఇంటికి రానివ్వరని కామెంట్ చేశారు. నిర్లక్ష్యంగా ఉంటే ప్రజల ముఖాలకు కూడా రంగులు వేసే వ్యక్తి జగన్ అని దుయ్యబట్టారు. జగన్ రెడ్డి విధానాలతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయిందని విమర్శించారు.
తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో చంద్రబాబుకు ప్రతి సెంటర్ వద్ద క్రేన్ ద్వారా గజమాలలతో స్వాగతం పలికారు. మధురపూడి ఎయిర్పోర్టు నుంచి బూరుగుపూడి, కోరుకొండ మీదుగా గుమ్మళ్లదొడ్డికి చేరుకున్నారు. అక్కడ మహిళలు హారతులు పట్టారు. టీడీపీ తెదేపా నేతలు చిన రాజప్ప, జ్యోతుల నెహ్రూ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
పోలవరం నిర్వాసితులకు న్యాయం చేసే బాధ్యత తమపై ఉందని చంద్రబాబు (chandrababu) స్పష్టం చేశారు. వెయ్యి ఎకరాల పరిహారాన్ని బోగస్ పట్టాలతో వైసీపీ నేతలు కొట్టేస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే సీబీఐ (cbi) విచారణ జరిపిస్తుందని తెలిపారు. ప్రజాధనాన్ని హారతి కర్పూరంలా మింగేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల భూములు సర్వే చేసి .. జగన్ తన బొమ్మలు వేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.