»Chandrababu Participated In Iftar Dinner In Kadapa
Iftar feast : కడపలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న చంద్రబాబు
కడప పెద్ద దర్గా లో రంజాన్ మాస ప్రార్థనల్లో, ఇఫ్తార్ విందులో పాల్గొన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) మరియు ఇతర టిడిపి నాయకులు.... కార్యకర్తలు పుత్తా ఎస్టేట్ (Putta Estate)వేదికైంది.అక్కడ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు(Iftar feast) లో పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ (Ramadan) శుభాకాంక్షలు తెలియజేశారు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) కడప (Kadapa) జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ జోన్-5 సమావేశానికి కడప నగరంలోని బిల్టప్ కూడలిలోని పుత్తా ఎస్టేట్ (Putta Estate)వేదికైంది.అక్కడ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు(Iftar feast) లో పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ (Ramadan) శుభాకాంక్షలు తెలియజేశారు. ఉమ్మడి కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని 5 పార్లమెంటరీ నియోజకవర్గాల స్థాయి సమావేశం జరగనుంది. సమావేశానికి 35 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీలోని వివిధ విభాగాలకు చెందిన సభ్యులు హాజరుకానున్నారు.
ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభం కాగా, మొత్తం 2,700 మంది హాజరయ్యారు. సమావేశాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Achchennaidu) ప్రారంభించారు. మధ్యాహ్నం 1.15 గంటలకు హైదరాబాద్ నుంచి కడపకు విమానంలో చంద్రబాబు చేరుకున్నారు. అనంతరం పుత్తా ఎస్టేట్‌కు చేరుకుని తర్వాత పార్టీ సమావేశంలో పాల్గొన్నారు.నియోజకవర్గాల వారీగా పార్టీ పనితీరును సమీక్షించడంతో పాటు వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ సమావేశం అనంతరం కడప పెద్ద దర్గాలో జరిగే ఇఫ్తార్ విందులో పాల్గొని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి బద్వేలుకు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి బుధవారం ఉదయం బద్వేలు (Badvelu)నియోజకవర్గ నేతలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు.