టీడీపీ అధినేత చంద్రబాబు,ఎమ్మెల్యే బాలకృష్ణలను ఉద్దేశించి ఏపీ మంత్రి రోజా (Minister Roja) హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు జైలుకి వెళ్లడం ఖాయమని మంత్రి రోజా అన్నారు.రూ. 118 కోట్ల ముడుపుల కేసులో విచారణ ఎదుర్కొనే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు (Chandrababu) విచారణ ఎదుర్కొంటారా? లేక బాలకృష్ణలా మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంటారా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు సింపతీ కోసమేనని చెప్పారు. అలిపిరి(Alipiri)లో బాంబు పేలినప్పుడే ఆయనపై సింపతీ రాలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. చంద్రబాబు, నారా లోకేశ్ లను జైల్లో పెడితేనే ప్రజలకు మేలు అని రోజా తెలిపారు. విజయ్ మాల్యా (Vijay Mallya) మాదిరి చంద్రబాబు విదేశాలకు పారిపోయే అవకాశం కూడా ఉందని ఆమె చెప్పారు. బాబు అరెస్ట్ అయితే రాష్ట్ర ప్రజలు సంబరాలు చేసుకుంటారని ఆమె అన్నారు.
2019లో ఎన్నికల ముందు మోదీ నన్ను అరెస్ట్ చేస్తారని సింపతి డ్రామా ఆడింది చంద్రబాబు కాదా?. చంద్రబాబుని కచ్చితంగా అరెస్ట్ చేయాలి. బాబుని ముడుపుల కేసులో సీబీఐ (CBI), ఈడీ విచారించాలి’’ అని మంత్రి రోజా డిమాండ్ చేశారు.అచ్చన్నలా ఆసుపత్రిలో చేరతారా? విజయ్ మల్యాలా విదేశాలకు పారిపోతారా? ఇవన్నీ కాకుండా ఇప్పటిలాగే మరో స్టే తెచ్చుకుంటారా?’ అని ప్రశ్నిస్తూ సెటైర్లు వేశారు.ముఖ్యంగా ప్రశ్నిస్తా అంటూ చెప్పే పవన్ కల్యాణ్ (Pavanklayan) ఎక్కడ దాక్కున్నాడని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. బీజేపీ అంటే ఏపీలో బాబు జనతా పార్టీగా మారిందని.. పురంధేశ్వరి ఎందుకు మరిది గురించి మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కాగా, మరోవైపు దేశం పేరును ఇకపై భారత్‌గా పిలవబోతున్నారనే సంకేతాల నేపథ్యంలో..ఇండియా పేరు మార్పులో తనకేం తప్పు కనిపించట్లేదని మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఇంగ్లీష్‌లో ఇండియా (India) అనడం కంటే.. తెలుగులో భారత్ అని అనడం చాలా బాగుందన్నారు.