»Twins In The Stomach Of A 10 Month Old Baby Surprised Doctors
New Born Baby: 10 నెలల చిన్నారి కడుపులో కవలలు..ఆశ్చర్యపోయిన డాక్టర్లు!
ఓ పది నెలల శిశువు కడుపు నొప్పితో బాధపడుతోంది. పాపను తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లగా డాక్టర్లు చిన్నారి కడుపులో కణితి ఉందని భావించారు. అల్ట్రా స్కానింగ్ చేయగా ఆమె కడుపులో రెండు కవల పిండాలు ఉన్నట్లు గుర్తించి షాక్ అయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో ఓ బిడ్డకు జన్మనివ్వడం అనేది ఎంతో ఆనందకర విషయం. ఓ గర్భిణీ తొమ్మిది నెలలూ కడుపులో మోసిన తన బిడ్డ కోసం ఎంతగానో ఎదురుచూస్తుంది. అయితే ఇక్కడ మాత్రం 10 నెలల పసిపాప గర్భవతి అయ్యింది. ఆమె కడుపులో కవలలు ఉన్నారని తెలిసి డాక్టర్లే ఆశ్చర్యపోయారు. తరచూ పాప ఏడుస్తుండటంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యులకు చూపించారు. శిశువు కడుపు కింది భాగంలో నొప్పి వస్తున్నట్లుగా వైద్యులు గుర్తించారు. చిన్నారి కడుపులో కణిత ఉందేమోనని టెస్ట్ చేయించగా కడుపులో రెండు జంట పిండాలు ఉండటం చూసి షాక్ అయ్యారు.
పాకిస్తాన్ లోని సాదికాబాద్లో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొన్ని రోజుల నుంచి 10 నెలల చిన్నారి గుక్కపట్టి ఏడుస్తూనే ఉంది. తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆ శిశువుకు అల్ట్రాసౌండ్ టెస్ట్ చేశారు. అయితే బాలిక కడుపు ద్రవంతో నిండిపోయిందని భావించి ఆపరేషన్ చేశారు. రెండు గంటల పాటు ఆ చిన్నారికి ఆపరేషన్ చేయగా డాక్టర్లకు షాకింగ్ విషయం తెలిసింది.
సర్జరీ చేసి బాలిక పొత్తికడుపు దిగువ నుండి కణితిని తొలగించినప్పుడు వారికి కడుపులో పూర్తిగా ఎదగని రెండు జంట పిండాలు కనిపించాయి. సుమారుగా 5 లక్షల ఆడపిల్లల్లో ఒకరికి మాత్రమే ఇలా జరుగుతుంది. దీనినే వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనే వ్యాధిగా వైద్యులు స్పష్టం చేశారు. కవల పిండాలు శిశువు శరీరంలో ఇరుక్కుపోయాయని, ఆపరేషన్ చేయడానికి వారికి కష్టంగా మారిందని సర్జన్ ముస్తాక్ అహ్మద్ వెల్లడించారు. ప్రస్తుతం శిశువు పరిస్థితి నిలకడగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.