కృష్ణా: నూజివీడు మండలం సిద్ధార్థనగర్‌లో ఆర్ అండ్ బీ రహదారి పక్కన మురుగునీరు రోజుల తరబడి నిల్వ ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోయారు. మురుగునీరు దుర్వాసన వెదజల్లడంతోపాటు రోజురోజుకు దోమల ఉద్ధృతి కూడా పెరుగుతోందన్నారు. సంబంధిత అధికారులు స్పందించి మురుగునీరు నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.