W.G. తాడేపల్లిగూడెం పట్టణంలోని ప్రధాన సెంటర్లో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్దే ధ్యేయంగా జనసేన పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్తుందని పేర్కొన్నారు.