GNTR: నియోజకవర్గంలో నూరు శాతం సీసీ రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తానని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గళ్లా మాధవి అన్నారు. సోమవారం పశ్చిమ నియోజకవర్గం 21వ డివిజన్ చుట్టుగుంట హీరో షోరూం వద్ద సీసీ డ్రైన్లు, కల్వర్టు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం రోడ్ల గురించి పట్టించకపోవడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు.