ప్రకాశం: కనిగిరి సబ్ డివిజన్లో క్రిస్మస్ పండగ సందర్భంగా చర్చీలు, ప్రార్థనా మందిరాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తామని కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ అన్నారు. బుధవారం స్థానిక డి.ఎస్.పి కార్యాలయంల ఆయన మాట్లాడుతూ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపి ప్రశాంతమైన వాతావరణంలో పండుగను జరుపుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరు చట్టానికి లోబడి ప్రవర్తించాలని సూచించారు.