VZM: బొబ్బిలి మున్సిపల్ ఛైర్మన్ రాబార్కి శరత్ బాబు బుధవారం మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో మౌలిక సౌకర్యాలు కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని, కాలువలు, రోడ్లు నిర్మాణం చేసి తాగునీరు సంపూర్ణంగా అందిస్తామని చెప్పారు. అన్ని వార్డులలో మౌలిక సౌకర్యాలు కల్పిస్తామన్నారు.