KRNL: ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు ఎంబీ యెరూషలేము చర్చి వెనుక ఉన్న ఖాళీ స్థలాన్ని ఆ సంఘానికే కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. చర్చి సంఘం అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు.