KDP: కమలాపురంలో రౌడీ షీటర్లకు సీఐ మోహన్ బుధవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాత పద్ధతులు మార్చుకుని సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఎవరైనా అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.