KMR: లింగంపేట, నాగిరెడ్డిపేట మండలాల్లో అర్ధరాత్రి రెవెన్యూ, పోలీస్ అధికారులు ఉమ్మడిగా మెరుపు దాడులు నిర్వహించి, వాగుల నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్లను సీజ్ చేశారు. నకిలీ విత్తనాలపై నిఘా కొనసాగుతుండగానే ఇసుక మాఫియా రంగంలోకి దిగడంపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక మాఫియా ఆపకపోతే కఠిన చర్యలు తప్పవని అధికారులు పేర్కొన్నారు.