SKLM: ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో కాగువాడ గ్రామానికి చెందిన కేశవరావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.2 లక్షల చెక్కును అతను భార్య ఉషాకుమారికి ఎమ్మెల్యే అందజేశారు. ఈ నిధులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.