VZM: ప్రజల రక్షణే ధ్యేయంగా విధి నిర్వహణలో పోలీసులు ముందుండాలని ఎస్పీ అంకిత సురాన అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా గురువారం కొమరాడ పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని రికార్డులను పరిశీలించి, కేసుల నమోదు, వాటి స్థితి గతులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.